భూసేకరణ
1. భూ సేకరణ, సమాజంలో మనం ఈరోజు చూస్తున్న అనేక సమస్యలకున్న అనేక కారణాలలో, అత్యంత ప్రధానమైనది. (వేర్పాటువాదాలకు కూడ)
అందుకని ఆయా సమస్యలకు సరైన జవాబుల వెదుకు లాట లో భూసేకరణ లో చారిత్రక లోపాల్ని సరి చేయడం లో మాత్రమే ఉంటుంది, ఉంది
అందుకని ఆయా సమస్యలకు సరైన జవాబుల వెదుకు లాట లో భూసేకరణ లో చారిత్రక లోపాల్ని సరి చేయడం లో మాత్రమే ఉంటుంది, ఉంది
2. ఆ మొట్ట మొదటి అడుగే - "భూయజమాన్యం సేంద్రియ సాగు రైతన్నల జన్మహక్కు" గా గుర్తించడం , ఇవ్వడం.
(the very first step is to recognize that Land ownership is the inalienable right of the organic farmer and grant it.)
దీనికి భారత రాజ్జ్యాంగం లో మౌలిక సవరణ అవసరం లేదు. ఆస్తి హక్కు మన దేశం లో ప్రాథమిక హక్కు కాదు.
విద్య ను చిన్నారుల ప్రాథమిక హక్కు చేసిన బాట లోనే దీనికి కూడ చట్టం చేయ వచ్చు.
3. మరే ఇతర వినియోగాలకైనా, భూమి కేవలం అద్దెకు మాత్రమే - ఎట్టి యజమాన్యపు హక్కులు లేకుండా ఇవ్వవచ్చు
అదీ కేవలం ఆ రైతుల చిన్న సమాజం - గ్రామ సభ- ఊరించే ఇతర వినియోగంలో గల కష్ట నష్టాలు అన్నిటినీ, ముఖ్యంగా పైకి కనిపించని వాటిని గురించి కూడ, అవసరమైతే బాగా తెలిసిన వారి సలహాల తరువాత, అంగీకరిస్తేనే.(i.e., only after the gramasabha consults other knowledgeable and takes an 'informed decision'.)
ఇందుకు అవసరమైతే, అయా రైతన్నల్ని నిపుణుల కార్యాలయాలకు, సంస్థలకు పమ్పిచాలి. ఆ ఖర్చులన్నీ ఆయా ప్రాజెక్టుల ముందస్తు ఖర్చులుగా (as project feasibility expenses) అ భూముల ఇతర వినియోగాలను కోరేవారు భరించాలి.
ఇందుకు అవసరమైతే, అయా రైతన్నల్ని నిపుణుల కార్యాలయాలకు, సంస్థలకు పమ్పిచాలి. ఆ ఖర్చులన్నీ ఆయా ప్రాజెక్టుల ముందస్తు ఖర్చులుగా (as project feasibility expenses) అ భూముల ఇతర వినియోగాలను కోరేవారు భరించాలి.
4. ఇతర వినియోగాలలో వుండాల్సిన పచ్చదనం (పచ్చిక మైదానాలతో సహా ) ఆయా రైతన్నలే చేస్తారు.
చట్టపరంగా తమ ఆధీనం చేయబడిన భూమి లో ఉంచ వలసి పచ్చదనాన్ని సైతం కాగితాలకే పరిమితం చేస్తున్న సంస్థలలో దీన్ని వెంటనే అమలు చేయ వచ్చు.
5. అద్దె కాలం, వినియోగాన్ని బట్టి, దశాబ్దాల పాటు ఉండవచ్చు.
కాని, అద్దె మాత్రం ప్రతి ఏడూ ఆ చుట్టుప్రక్కల రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఉన్న
i) సాగు భూముల(రైతన్నల) అమ్మకాల - కొనుగోళ్ళ ధరల ఆధారంగా సగటు విలువ లో నిర్దిష్ట శాతం ఉండాలి
లేదా
ii) ఇతర వినియోగాలకు భూమి అద్దెల సగటుగా అన్నా ఉండాలి
దేశమంతా ఒకే విధంగా, మరెవ్వరి విచక్షణకూ తావు లేకుండా ఉండాలి. చట్టం లో ఈ విచచక్షణ లే 'ఏలికల - అధికారుల' కుమ్మక్కు తో సాగుతున్న తెర వెనుక నిర్ణయాలకూ, ఆశ్రిత పక్షపాతానికీ, అవినీతికి రాచ బాటలు వేస్తున్నాయ్ - మెగా స్కాముల దోపిడీలు వీటి పుణ్యమే. 'ఒకే దేశం ఒకే సూత్రం'.
6. వినియోగం సమాజ ఉపయోగానికైనా సరే ఇదే పధ్ధతి - (భరత మాత ఒక్కతే )
సమాజంలో గరీబులకు వెసలు బాటు కల్పించడం అందరి బాధ్యత. అది ఏలికల హక్కు - కానీ, ఆ ఆర్ధిక బాధ్యతల నిర్ణయాలు కేవలం తెరమీద మాత్రమే, ప్రజాపద్దులలో చట్టసభలలో మాత్రమే జరగాలి, తెర వెనుక కాదు. (only in a transparent way in the budgets, approved in the legislatures and not behind the scene.)
7. ఇతర వినియోగాలలో వచ్చే అద్దె రాబడి లో కొంత భాగం పర్యావరణ ఆరోగ్య నిధిగా (as an Environmental Restoration Corpus fund) రాబోయే తరాలకు ఉంచాలి.
వాళ్ళు ఆయా భూముల్ని మరల సేంద్రియ సాగుకి తీసుకు రావడానికి అయ్యే ఖర్చుల్ని ఇప్పుడే ఊహించి, అవసరమైతే పర్యావరణ సెస్ ద్వారా పై ఆరోగ్యనిధి లో ప్రతి నెలా జమచేయాలి.
అప్పుడు మాత్రమే పారిశ్రామిక విప్లవం జనాల సుస్థిర (అభివ్రిద్ధి) దిశలో (in a sustainable way) జరిగే వీలు ఉంటుంది.
అప్పుడు మాత్రమే
"ఉత్పత్తి ఖర్చులు ఎక్కడ తక్కువ - పెద్ద పరిశ్రమల్లోనా లేక చిన్ని పరిశ్రమల్లోనా?" అనే ప్రశ్నకు
అర్థం ఉంటుంది, సరైన జవాబు వస్తుంది.

No comments:
Post a Comment